తమిళనాడులో భారీ వర్షాలు

హెచ్చరించిన వాతావరణ శాఖ

Heavy rains in Tamil Nadu
Heavy rains in Tamil Nadu

చెన్నై: తమిళనాడులో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 22 మంది మృతి చెందారు. ఈ కారణంగా 8 జిల్లాల్లో పాఠశాలలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కడలూరులో కురుస్తున్న వర్షాల కారణంగా వేలారు నది పొంగి ప్రవహిస్తుంది, ఈ ప్రవాహం దాటికి కడలూరులో వంతెన తెగిపోవడంతో పరిసర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామనాథపురం, అరియలూర్‌, శివగింగై, పెరంబలూర్‌, పుదుకొట్టే జిల్లాల్లో వర్షం భారీగా కురిసింది. అంతేకాకుండా మెట్టుపాళ్యంలో అత్యధికంగా 18 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాభావం మరో 24 గంటలపాటు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/