ప్రజలను రక్షించేందుకు అనేక చర్యలు చేపట్టాం

Odisha CM,Naveen Patnaik
Odisha CM,Naveen Patnaik

ఒడిశా: ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌ మీడియాతో మాట్లాడుతు ఫణి తుఫాన్‌ ప్రభావం నుండి ప్రజలను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టాం తుఫాను రాకముందే కేవలం 24 గంటల సమయంలోనే దాదాపు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సిఎం తెలిపారు. గంజామ్‌ జిల్లా నుండి 3.2 లక్షలు, పూరీ నుండి 1.3 లక్షల మందిని తరలించామని చెప్పారు. రాత్రికి రాత్రే సుమారు 9 వేల షెల్ట‌ర్లు ఏర్పాటు చేశామ‌న్నారు. అక్క‌డ ఆశ్ర‌యం పొందుతున్న‌వారికి భోజ‌నం ఏర్పాటు చేసేందుకు 7వేల కిచెన్‌లు ప‌నిచేశాయ‌న్నారు. ఈ భారీ ఆప‌రేష‌న్ కోసం సుమారు 45 వేల మంది వాలంటీర్లు ప‌నిచేసిన‌ట్లు సీఎం వెల్ల‌డించారు. ఫణి బంగ్లాదేశ్ మీద‌గా మ‌రింత బ‌ల‌హీన‌ప‌డి హిమాల‌యాల్లోకి ప్ర‌వేశించ‌నున్న‌ది. తుఫాన్ వ‌ల్ల ఒడిశాలో సుమారు 15 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/