త్వరలో తేలనున్న సీట్ల సర్దుబాటు

siddharamaiah, kumara swamy
siddharamaiah, kumara swamy


బెంగళూరు: బెంగళూరులో కాంగ్రెస్‌, జేడిఎస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య, సియం హెచ్‌ డీ కుమారస్వామితో పాటు ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నట్లు చెప్పారు. పరస్పర అవగాహన, సరైన ప్రణాళికతో తాము ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. త్వరలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి తుది నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు.