కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

కాగేరి ఒక్కరే నామినేషన్‌ వేయడంతో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది

Vishweshwar Hegde Kageri
Vishweshwar Hegde Kageri

బెంగళూరు: బిజెపి సీనియర్‌ ఎమ్మెల్యె విశ్వేశ్వర హెగ్డే కాగేరి కర్ణాటక శాసనసభ కొత్త స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బిజెపి కాగేరి ఒక్కరే నామినేషన్‌ వేయడంతో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనసభలో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌, జేడీఎస్‌లు పోటీ చేయలేదు. కాగా నూతన స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను బుధవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌ కృష్ణారెడ్డి నిర్వహించారు. స్పీకర్‌ ఎన్నికయ్యాక ఆయన కూడా తన పదవికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్జేడీఎస్ సంకీర్ణంలోని కుమారస్వామి ప్రభుత్వం మెజారిటీ లేక విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో బీజేపీ పక్ష నేత యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేష్ కుమార్ స్పీకర్ పదవికి వెంటనే రాజీనామా చేసేశారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/