ల్యాండర్‌కు ఎలాంటి నష్టం జరగలేదు!

ISRO
ISRO

బెంగళూరు: చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయినట్టు ఆర్బిటర్ పంపిన చిత్రాల ద్వారా గుర్తించిన శాస్త్రవేత్తలు దానితో సంకేతాలు పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగుతూ 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా విక్రమ్‌తో భూ కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి. దక్షిణ ధ్రువంపై ఇస్రో నిర్దేశించిన ప్రదేశానికి సమీపంలోనే విక్రమ్ ల్యాండింగ్ అయినట్టు ఆర్బిటర్‌లోని కెమెరా పంపిన థర్మల్ ఇమేజ్‌ ద్వారా గుర్తించారు. కాగా ల్యాండర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, అది వంగి ఉందని చంద్రయాన్2లో పాలుపంచుకున్న ఓ ఇస్రో అధికారి తెలిపారు. అన్ని అవకాశాలను వినియోగించుకుని ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో శాస్త్రవేత్తల బృందం ఈ పనిలో నిమగ్నమై ఉందని అన్నారు. రోజుకు 17 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తున్నారు. చంద్రయాన్2 వ్యోమనౌకలో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌ ఉండగా సెప్టెంబరు 2న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడిపోయి చంద్రుడి ఉపరితలంవైపు ప్రయాణించింది. ఉపరితలంవైపు ప్రయాణించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/