సిద్ధార్థ మృతదేహానికి పూర్తయిన పోస్ట్‌మార్టం
పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను వెల్లడించలేదు

మంగళూరు: కేఫ్ కాఫీ డే వ్వవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. వెన్లాక్ హాస్పిటల్లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చిక్‌మగళూరుకు తరలించారు. అయితే పోస్ట్‌మార్టం పూర్తయినప్పటికీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలను.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను వెల్లడించలేదు. పోస్ట్‌మార్టం నివేదిక బయటికొస్తే సిద్ధార్థ మృతిపై నెలకొన్న పలు సందేహాలకు సమాధానం దొరికే అవకాశం ఉంది. సిద్ధార్థ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన మామ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎమ్ కృష్ణ బయల్దేరి వెళ్లారు. కర్నాటకకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ప్రముఖులు వీజీ సిద్ధార్థ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
కాగా మంగళవారం సాయంత్రం నేత్రావతి నది వద్ద అదృశ్యమైన సిద్ధార్థ బుధవారం ఉదయం నదీ తీరంలో నిర్జీవ స్థితిలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన జేబులోని సెల్‌ఫోన్ ఆధారంగా ఆ మృతదేహం సిద్ధార్థదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/