ఆప్‌ ఎంపీపై వెంకయ్యనాయుడు సీరియస్‌

Venkaiah Naidu
Venkaiah Naidu

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి నాణ్యత అంశంపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. జీరో అవర్‌లో ఈ అంశంపై బిజెపి ఎంపీ విజయ్ గోయల్‌ మాట్లాడారు. ఆ సమయంలో ఆప్‌ నేత సంజయ్ సింగ్‌ నినాదాలు చేశారు. ఢిల్లీలో నీటి నాణ్యత సరిగా లేదని గోయల్‌ కొన్ని నివేదికలు చదువుతుండగా..ఆ వ్యాఖ్యలను అరుపులతో ఆప్‌ ఎంపీ సంజయ్ అడ్డుకున్నారు. ఆ సమయంలో చైర్మెన్‌ వెంకయ్యనాయుడు ఆప్‌ ఎంపీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నువ్వేమైనా మంత్రివా అంటూ ఆప్‌ ఎంపీపై వెంకయ్యనాయుడు సీరియస్‌ అయ్యారు. నీటి నాణ్యత సరిగా లేదని పత్రికల్లో వచ్చిన కథనాలను గోయల్‌ సభలో ప్రస్తావించారు. అయితే బిజెపి ఎంపీ చేసిన వ్యాఖ్యలను కూడా వెంకయ్య తప్పుపట్టారు. వాటర్‌ బాటిళ్లు, కాలుష్య మాస్క్‌లను సభలో చూపెట్టరాదు అని గోయల్‌కు చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/