కాంగ్రెస్‌ పార్టీకి ఊర్మిళ రాజీనామా


ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఊర్మిళ

Urmilla Matondkar
Urmilla Matondkar

ముంబయి: సినీ నటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలోని చిల్లర రాజకీయాలతో విసిగిపోయానని… అందుకే పార్టీకి రాజీనామా చేశానని ఆమె తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ముంబై లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి, ఓటమిపాలయ్యారు. బిజెపి సీనియర్ నేత గోపాల్ శెట్టి చేతిలో ఆమె ఓడిపోయారు. రంగీలా, జుదాయి, మస్త్ వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాల్లో ఊర్మిళ నటించారు. ఎన్నికలకు ముందే ఆమె కాంగ్రెస్ లో చేరారు. నెలలు కూడా గడవక ముందే ఆమె ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం గమనార్హం.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/