బాధితురాలి కుటుంబసభ్యులు కోరితే కేసును సీబీఐకి

Unnao road accident
Unnao road accident

లఖ్‌నవూ: ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసు విచారణను సీబీఐకీ బదలాయించాలిని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అంతకు ముందు ఈ కేసుపై మాట్లాడిన ఆ రాష్ట్ర డీజీపీ బాధితురాలి కుటుంబసభ్యులు కోరితే కేసును సబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్ సోమవారం రాత్రి ప్రకటన చేశారు.ప్రాథమిక ఆధారాల ప్రకారం ఘటన రోడ్డు ప్రమాదంగానే భావిస్తున్నప్పటికీ ఎటువంటి అనుమానాలకు తావులేకుండా లోతైన విచారణ కొనసాగుతోందన్నారు. అంతకుముందు ఈ ఘటన వెనక భారీ కుట్ర ఉందని.. కేసుని సీబీఐకి బదలాయించాలని పలువురు రాజకీయ ప్రముఖులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/