దిశ తల్లిదండ్రులకు నిర్భయ తల్లి మెసేజ్!

దిశకు న్యాయం జరుగుతుందని ఆశాభావం

nirbhaya mother asha devi
nirbhaya mother asha devi

హైదరాబాద్‌: ఢిల్లీ రోడ్లపై తిరుగుతున్న బస్సులో ఆశాదేవి కుమార్తె(23)ను ఆరుగురు అగంతకులు దారుణంగా అత్యాచారం చేశారు. 2012 లో జరిగిన ఈ ఘటనలోని బాధితురాలు నిర్భయ 13 రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. ఈ నేపథ్యంలోనే నిర్భయ చట్టం వచ్చిన విషయం తెలిసిందే. కాగా నిర్భయ తల్లి ఆశాదేవి తమ బిడ్డకు న్యాయం జరగలేదని కానీ హైదరాబాద్‌లో అత్యాచారానికి గురైన దిశ తల్లిదండ్రులకు మాత్రం సత్వర న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పశు వైద్యురాలి అత్యాచారం అత్యంత దారుణం. నిర్భయ విషయంలో తాము ఇంకా పోరాడుతూనే ఉన్నామని, ఏడేళ్లు గడిచాయి అయినా న్యాయం జరగలేదన్నారు. కానీ నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. దిశ విషయంలో వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుంది అని దిశ తల్లిదండ్రులను ఉద్ధేశించి ఆమె వ్యాఖ్యానించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/