ఐక్యతా విగ్రహం అమ్ముతాం.

ఓఎల్‌ఎక్స్‌ లో ఆకతాయిల ప్రకటన

staue of unity
statue of unity

వడోదర: కరోనాపై పోరుకు నిధుల కోసం అంటూ కొందరు ఆకతాయిలు ఏకంగా (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ) ప్రపంచంలోనే అత్యంత ఎతైన ఐక్యతా విగ్రహన్ని ఓఎల్‌ఎక్స్‌ లో పెడుతున్నట్లు ప్రకటన ఉంచారు. రూ.30,000 కోట్లకు ఈ విగ్రహన్ని విక్రయిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన ఐక్యతా విగ్రహ నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిపై మోసానికి పాల్పడడం, అంటువ్యాధుల నివారణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ప్రకటనను ఓఎల్‌ఎక్స్‌ తమ వెబ్‌సైట్‌ నుంచి తీసివేసి, ట్విటర్‌ ద్వారా క్షమాపణలు కోరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/