చైనా సరిహద్దుల్లో పర్యటించిన కేంద్రమంత్రి

Rajnath Singh
Rajnath Singh

అరుణాచల్‌ ప్రదేశ్‌(బుమ్లా పాస్‌): కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం చైనా సరిహద్దుల్లో పర్యటించారు. ఇండియా-చైనా సరిహద్దులో గల బుమ్లా పాస్‌ ప్రాంతంలో ఆయన భారతసైనికులను కలుసుకున్నారు. అనంతరం దేశ సరిహద్దుల్లోని పరిస్థితులను పరిశీలించిన కేంద్రమంత్రి సైనికులతో కాసేపు ముచ్చటించారు. సైనికులతో కలిసి సరదాగా ఫోటోలు కూడా దిగారు. చైనా సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని సైనికులు వెల్లడించినట్లు రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. భారత సరిహద్దులో పహరా కాస్తున్న సైనికులను ఆయన అభినందించారు. దేశ సరిహద్దుల్లో సైనికులను కలుసుకునే గొప్ప అవకాశం తనకు లభించిందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/