కేంద్ర కేబినెట్‌ సమావేశం

కరోనా వైరస్ వ్యాప్తిపై చర్చ

pm modi
pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరంద్రమోడి నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చిస్తున్నారు. లాక్‌డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించింది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కరోనా, లాక్‌డౌన్‌ అంశాలతో పాటు లడఖ్‌లో చైనాతో ఏర్పడిన పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/