పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

Union Cabinet
Union Cabinet

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం ఈరోజు కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఉదయం 9.30 గంటలకు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అయితే ఈ వారంలోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ బిల్లు ప్రవేశపెడతారని తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌సింగ్ ఇప్పటికే ఈ బిల్లుపై సంకేతాలిచ్చారు. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఉభయసభల్లో సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని కూడా మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల్లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఏ రకమైన పత్రాలు లేకపోయినా వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్‌లో 11 ఏళ్లు తప్పనిసరిగా నివసించి ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది. దానిని ఇప్పుడు ఆరేళ్లకు తగ్గించినట్లు సమాచారం. 1955నాటి పౌరసత్వ బిల్లు స్థానే దీన్ని తెస్తున్నారు. అయితే, ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/