రాజస్థాన్‌ యువతకు రూ.3500 నిరుద్యోగ భృతి!

unemployees
unemployees

జైపూర్‌: నిరుద్యోగ భృతి అందించే విషయంలో సియం అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,500 అందించాలని, రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదలుకుని ఈ నగదు సాయాన్ని అందించాలని సియం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయం పొందాలంటే డిగ్రీ పూర్తి చేసి రాజస్థాన్‌కు చెందిన యువతై ఉండాలి. ఈ స్కీం కింద యువకులకు రూ.3000 , యువతులకు, దివ్యాంగులకు రూ.3500 నిరుద్యోగ భృతి అందించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/