పార్టీ పేరును దెబ్బతీసే నేతలు మనకొద్దు

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: బిజెపి ఎమ్మెల్యె ఆకాశ్‌ విజయ్‌ వర్గియా ఇటివల మున్సిపల్‌ అధికారులపై దాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ విషయంపై ప్రస్తావించిన ఆయన పార్టీ ఎంపిలకు గట్టి హెచ్చరికలు చేసినట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి. అయిత పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారు ఎవరైనా సరే సహించేది లేదని మోడి స్పష్టం చేశారట పార్టీ పేరును దెబ్బతీసే నేతలు మనకొద్దు. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు. ఎవరి కుమారుడైనా సరే, బంధువైనా సరే అలాంటి వారిని పార్టీ నుంచి తొలగించాలి. వారికి మద్దతిచ్చే వారిని కూడా తొలగించాలి. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. పార్టీ పేరు చెప్పి దురుసుగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు అని మోడి ఆకాశ్‌ను ఉద్దేశిస్తూ అన్నట్లు సమాచారం. బిజెపి జనరల్‌ సెక్రటరీ కైలాశ్‌ విజయ్‌ వర్గియా కుమారుడే ఆకాశ్.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/