శివసేనతో బిజెపి చర్చలు, సర్వేపై కాంగ్రెస్‌ చిందులు

BJP and Sivasena
BJP and Sivasena


ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీకి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలు తమ వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. పొత్తులు, ఎత్తులపై అధికార బిజెపి దృష్టి సారించింది. ఈ మేరకు శివసేనతో బిజెపి నేతలు చర్చలు జరిపారు. సీట్ల అంశంపై వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. కానీ ఏయే స్థానాలపై పోటీ అంశంపై చర్చల్లో స్పష్టత రాలేదు. మహారాష్ట్ర అసెంబీలో 288 సీట్లు ఉన్నాయి. బిజెపి మహారాష్ట్ర చీఫ్‌ చంద్రకాత్‌ పాటిల్‌ నివాసంలో ఆర్థిక మంత్రి, బిజెపి నేత సుధీర్‌ ముంగటివర్‌, శివసేన నేత సుభాష్‌దేశా§్‌ు చర్చలు జరిపారు. అయితే ఇటీవల కాంగ్రెస్‌, ఎన్సీపి నుంచి కొందరు నేతలు బిజెపిలో చేరారు. దీనిపై ప్రశ్నించగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే సీటు ఇస్తామని బిజెపి నేతలు సంకేతాలిచ్చారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికి టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. బిజెపి భాగస్వామ్య కూటమిలో శివసేనతో పాటు రాష్ట్రీయ సమాజ్‌పక్ష్‌, రాష్ట్రీయ సమాజ్‌ పక్ష్‌-1 ఉన్నాయి. పొత్తులపై బిజెపి సమాలోచనలు చేస్తుంటే ఇటీవల బిజెపి విడుదల చేసిన సర్వేపై కాంగ్రెస్‌ తప్పుపట్టింది. మహారాష్ట్రలో 288 సీట్లలో అధికార బిజెపి 229 సీట్లు గెలుస్తుందని సర్వే వివరాలను బిజెపి విడుదల చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ఇవిఎం ద్వారా కాకుండా బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో బిజెపి విజయం నల్లేరు మీద నడక అయినప్పుడు మరి శివసేన, బిజెపి ఎందుకు రథయాత్రలు చేపడుతున్నాయని కాంగ్రెస్‌ నేత వడ్డెటివార్‌ ప్రశ్నించారు.ఆ పార్టీది మేకపోతు గాంభీర్యమని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/