ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

encounter
encounter

జమ్ముకాశ్మీర్‌: ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో ఉదయం భద్రతా బలగాలు షోపియాన్‌ జిల్లా అవ్నీరాలో గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాలకు ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా మరో నలుగురు సంఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలు గాలింపును కొనసాగిస్తున్నాయి.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/