పాక్‌ అనుమానిత గూఢచారుల అరెస్ట్‌

Army
Army

శ్రీనగర్‌: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు వెంట మంగళవారం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు సైనికాధికారులు తెలిపారు. అయితే వారిని పాకిస్థాన్‌ గూఢచారులుగా అనుమానిస్తున్నారు. వారిద్దరు సరిహద్దు వెంట గస్తీ కాస్తు, సమీపంలోని ఆర్మీ క్యాంప్‌ను, వాటి పరిసరాలను వీడియో చిత్రీకరిస్తూ జవాన్లకు చిక్కారు. దీంతో వారిని వెంటనే అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా ఒకరు కథువా, మరొకరు డొడా ప్రాంతానికి చెందినవారుగా తేలింది. వారి వద్ద ఉన్న ఫోన్లు క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అరెస్టుకు కొన్ని గంటల ముందు భారత్‌లోని పలు ప్రాంతాలను కవర్‌ చేస్తూ తీసిన వీడియోలను పాక్‌లోని కొంతమందికి పంపినట్లు తేలింది. అలాగే అక్కడి వారితో తరచూ సంభాషిస్తున్నట్లు కూడా వెల్లడైందని అధికారులు తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/