దేశ రాజధానిలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు హతం

Delhi encounter
Delhi encounter

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను ఢిల్లీ పోలీసులు ఇవాళ ప్రహ్లదపుర ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చేశారు. ఉదయం ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులు రాజా ఖురేషి, రమేష్ బహదూర్‌ను పోలీసులు కాల్చి చంపారు. ఇద్దరు కూడా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇదదరు పారిపోతూ… పోలీసులపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వారిపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చారు. ఇవాళ ఉదయం 5 నుంచి 5:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు,నిందితుల మధ్య 30 రౌండ్ల కాల్పులు జరిగాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/