ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Police Force jawans
Police Force jawans

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దాళాలు మట్టుబెట్టారు. మంగళవారం సౌత్ కాశ్మీర్, త్రాల్ ప్రాంతంలోని ఝండ్ గ్రామంలో ఉగ్రవాదులు ఓ ఇంటిలో దాగి ఉన్నారని సమచారం అందడంతో సిఆర్ పిఎఫ్, ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో అప్రమత్తమైన భద్రతా దాళాలు ఉగ్రవాదులపై ఎదరు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా.. ఇద్దరు సైనికులు గాయపడ్డారని జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/