పోలీంగ్‌ కేంద్రం వద్ద రెండు ఐఈడీ బాంబులు

ied bombs attempt
ied bombs attempt

పాట్నా: బీహార్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద రెండు ఐఈడీ బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. గయా జిల్లాలోని ఓ పాఠశాల వద్ద ఐఈడీ బాంబులు, బాక్సును పోలీసులు గుర్తించారు. తరువాత డాగ్‌ స్కాడ్‌ బృందాలు, భద్రతా బలగాలు తనిఖీలు చేసి.. ఆ రెండు ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేశారు. 40 లోక్‌సభ స్థానాలున్న బీహార్‌లో తొలి విడుతలో భాగంగా జముయి, గయా, ఔరంగాబాద్‌, నవాడా లోక్‌సభ నియోజకవర్గాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/