బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టుకే వెళ్లండి

Ravi Prakash , Supreme Court
Ravi Prakash , Supreme Court

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఈరోజు రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ జరిగింది. ఇందుకోసం ఆయన హైకోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు న్యాయస్థానం సూచిందింది. అయితే రవిప్రకాశ్‌ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు విన్పించగా.. సర్వోన్నత న్యాయస్థానం పలు ఆదేశాలు జారీచేసింది. జూన్‌ 10న విచారణ జరిపి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. అలాగే, 41ఏ నోటీసు కింద రవిప్రకాశ్‌ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆయనను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయాలనుకుంటే మాత్రం 48గంటలకు ముందుగానే నోటీసులు ఇవ్వాలని స్పష్టంచేసింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మెరిట్‌ ఆధారంగా విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీచేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/