ఈ 29న శశికళను కలవనున్న దినకరన్‌

sashikala, dinakaran
sashikala, dinakaran

చెన్నై: లోక్‌సభ ఎన్నికలు, 22 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైన అమ్మా మక్కల్‌ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్‌ ఈ నెల 29న శశికళతో సమావేశం కానున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడ్డాయి. రాష్ట్రానికి సంబంధించి 38 లోక్‌సభ, 22 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల్లో డిఎంకే అధిక స్థానాలను కైవసం చేసుకుంది.
అన్నాడిఎంకే నుంచి తప్పుకుని ఏఎంఎంకేను స్థాపించిన దినకరన్‌ ఈ ఎన్నికల భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఎన్నికల ఫలితాల్లో ఏఎంఎంకే అభ్యర్థులు తక్కువ శాతం ఓట్లను పొంది మూడో స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పరప్పన జైలులో ఉన్న శశికళను దినకరన్‌ కలుసుకుని, ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/