లోక్‌సభ స్పీకర్‌కు టిఆర్‌ఎస్‌ ఎంపీల ఫిర్యాదు

Om Prakash Birla
Om Prakash Birla

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఈరోజు లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లాను తెలంగాణ టిఆర్‌ఎస్‌ ఎంపిలు కలిశారు. సభలో పలువురు సభ్యులు గందరగాళం సృష్టిస్తున్నారని స్పీకర్‌కు వారు ఫిర్యాదు చేశారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను టార్గెట్‌ చేస్తున్నారని, పలువురు లేవనెత్తిన అంశాలను రికార్డుల నుంచి తొలగించాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిపై సభాపతి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/