అలహాబాద్‌ నుంచి ఆప్‌ తరఫున ట్రాన్స్‌జెండర్‌ పోటీ

Bhawani Nath Valmiki
Bhawani Nath Valmiki, transgender

న్యూఢిల్లీః ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. యూపిలోని అలహాబాద్‌ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్‌ భవానినాథ్‌ వాల్మీకి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సమాజంలో మంచి మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నపుడు చాలా పార్టీలతో మాట్లాడాను .తన ఆలోచనలు, సిద్దాంతాలు ఆమ్‌ ఆద్మీ పార్టీకి నచ్చడంతో ఆ పార్టీ అధిష్టానం అలహాబాద్‌ స్థానాన్ని తనకు కేటాయించిందని భవానీ తెలిపారు. సమాజంలో మార్పు కోసం కృషి చేస్తానని, ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతానని భవాని చెప్పారు. బిజెపి తరఫున రీటా బహుగుణ జోషి, ఎస్పి-బిఎస్పి కూటమి తరఫున రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ బరిలో ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/