ఈ నెల 15 నుండి రైళ్లు నడుస్తాయి..!

కాని రైలు ఎక్కాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి !

train
train

దిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల 14 తో లాక్‌డౌన్‌ గడువు ముగియనుండడంతో, ఈ నెల 15 నుండి రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారులతో సమావేశమైన రైల్వే బోర్డు చైర్మెన్‌ రైళ్లను నడపడం గురించి చర్చించి, ఎంపిక చేసిన మార్గాలలో మాత్రమే రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీనిద్వారా పలు ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారిని వారి గమ్యస్థానాలకు చేర్చవచ్చని వచ్చిన సూచనలకు రైల్వే చైర్మెన్‌ ఆమోదం తెలిపారు. కాని రైలు ఎక్కాలంటే పలు నిబంధనలు పాటించాలి అని రైల్వేశాఖ తెలిపింది. అవి…

 • అన్ని రైళ్లలో ఏసీ స్లీపర్‌క్లాస్‌ బోగీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
 • రైళ్లన్ని గమ్యస్థానం చేరేలోగా ఒకటి,లేదా రెండు స్టేషన్‌లలోనే ఆగుతాయి.
 • బెర్త్‌ ఖరారు అయిన వారికి మాత్రమే ప్రయాణం చేసే వీలుంటుంది.
 • ప్రయాణికులు కనీసం 12 గంటల ముందు తన ఆరోగ్య పరిస్థితిపై రైల్వే అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి.
 • ప్రయాణ సమయంలో లక్షణాలు కనిపిస్తే మధ్యలోనే అతనిని దింపేస్తారు.
 • వయో వృద్దులను అనుమతించరు.
 • ప్రయాణానికి 4గంటల ముందే స్టేషన్‌కు చేరుకోవాలి.
 • సామాజిక దూరం పాటించాలి.
 • థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షల అనంతరమే రైళ్లు ఎక్కాలి.
 • స్టేషన్‌లోనే నామ మాత్రపు రుసుం చెల్లించి మాస్క్‌, గ్లౌజులు కొనుగోలు చేసి రైళ్లు ఎక్కాలి.
 • రైలు క్యాబిన్‌ లో ఇద్దరు మాత్రమే ప్రయాణికులు ఉంటారు.
 • సైడ్‌ బెర్తులు ఖాళీగా ఉంటాయి.
 • ఏ విధమయిన తినుబండారాల విక్రయాలను అనుమతించరు.
  ఈ నిబంధనలతో రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/