రేపు మరోసారి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన రెండోదశ లాక్‌డౌన్‌ మే 3 తో ముగియనున్న నేపథ్యంలో రేపు మరోసారి దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కరోనా నపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న తీరు, అలాగే కరోనా కట్టడి చర్యలు. ఆంక్షల సడలింపు వంటి అంశాలపై ప్రధాని చర్చించనున్నారు. కాగా దేశంలో ఇప్పటికీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ కొనసాగించాలని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీనిపై కూడా చర్చించి మోదీ ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

తాజా ఏపి అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/