టోల్‌ గేట్ల ఫీజులు రద్దు

ఏప్రిల్‌ 14 దాకా వర్తింపు

Toll Gate

New Delhi: కరోనా నేపథ్యంలో అత్యవసర సేవల వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్‌గేట్ల దగ్గర ఫీజుల వసూలు తాత్కా లికంగా రద్దు చేసింది.

లౌక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర సేవల వాహనాలకు వెసులుబాటు కల్పించేందుకు కేంద్రం ఈమేరకు
టోల్‌గేట్ల ఫీజు వసూలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జాతీయ రహదారులపై టోల్‌ వసూళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.

ఏప్రిల్‌ 14 వరకు ఫీజు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యం నగరాల్లోని ప్రజలు సొంతూళ్లకు బయలు దేరడంతో టోల్‌ప్లాజాల దగ్గర భారీగా జామ్‌ అవుతోంది.

దీంతో ప్రయాణీకుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం టోల్‌గేటు ఫీజు రద్దు చేసింది.

కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని..టోల్‌ప్లాజాల వద్ద వసూళ్లను రద్దు చేయాలని ఆదేశించామని నితిన్‌ గడ్కరీ తెలిపారు.దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/