నేడు అయోధ్యపై తీర్పు

దశాబ్దాల తరబడిగా సాగుతున్న భూ వివాదానికి నేడు ముగింపు

Supreme Court-Babri Masjid
Supreme Court-Babri Masjid

న్యూఢిల్లీ : యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పు వెలువరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం సిద్ధమైంది. శనివారం ఉదయం 10.30 గ ంటలకు ప్రధాన న్యాయమూర్తి రం జన్ గొగోయ్ నేతృత్వంలోని అయి దుగురు న్యాయమూర్తులతో కూడి న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. దాదాపు 5 వేల పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించ వచ్చని తెలుస్తోంది. ఈ తీర్పునకు సంబంధించిన నోటీసును శుక్రవా రం సాయంత్రం సుప్రీంకోర్టు అధి కారిక వెబ్‌సైట్‌లో కూడా ఉంచా రు. శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఉ త్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రాజే ంద్ర కుమార్ తివారీ, రాష్ట్ర డిజిపి ఓంప్రకాశ్ సింగ్‌లను తన చాం బర్‌కు పిలిపించి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చించిన తర్వాత శనివారం తీర్పును వెలువరించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కాగా తీర్పుపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేసింది. యుపి వ్యాప్తంగా 40 వేలకు పైగా పారా మిలిటరీ బలగాలను మోహరించింది. మరో వైపు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్ ప్రకటించింది. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైనదిగా భావిస్తున్న రామజన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజులనుంచి పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కోట్లాది మంది హిందులు, ముస్లింల మనోభావాలకు సంబంధించిన అంశమైనందున అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు గురువారమే కేంద హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

జడ్జీలకు భద్రత పెంపు

అయోధ్య తీర్పు దృష్టా ఈ తీర్పు వెలువరించే ధర్మాసనంలోని అయిదుగురు జడ్జీలకు భద్రతను పెంచారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో పాటు గొగోయ్ పదవీ విరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న ఎస్‌ఎ బోబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్‌లు ఈ ధర్మాసనంలో ఉన్న విషయం తెలిసిందే.

విద్యాసంస్థలన్నిటికీ సెలవులు

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న దృష్టా ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థలు, శిక్షణాసం స్థలు అన్నీ శనివారంనుంచి సోమవారం వరకు మూ సి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/