నిర్భయ దోషుల్లో మృత్యుభయం..

Nirbhaya Convicts
Nirbhaya Convicts

న్యూఢిల్లీ:  నిర్భయ హత్యాచార ఘటన జరిగి ఏడేళ్లు గడిచినా.. దోషులకు ఇప్పటి వరకూ శిక్ష పడలేదు. వీరి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద ఉంది. ఈ పిటిషన్‌పై రాష్ట్రపతి ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. వీరి క్షమాభిక్ష రద్దయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. వీరిని ఉరితీయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్భయ దోషుల్లో ప్రాణభయం కనిపిస్తోంది. తమ చావు కళ్ల ముందు కదలాడుతున్న వేళ.. నిర్భయ దోషులకు నిద్ర కరువైంది. వారు అన్నపానీయాలను ముట్టడం లేదని సమాచారం.  దోషులు అక్షయ్, ముకేశ్, వినయ్, పవన్‌.. అర్ధరాత్రి వరకు తమ తమ జైలు గదుల్లోనే నిద్ర మానేసి అటూ ఇటూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జైలు అధికారులు ఇచ్చిన ఆహారాన్ని వారు సరిగా తినడం లేదు.  వీరి ఉరిశిక్ష అమలు గురించి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందలేదు. కానీ తిహార్ జైల్లో ఇప్పటికే ఉరి తీయడానికి అవసరమైన పనులు జరిగిపోతున్నాయి. నిర్భయ దోషులను డిసెంబర్ 16న లేదా డిసెంబర్ 29న (నిర్భయ చనిపోయిన రోజు) ఉరి తీస్తారని ప్రచారం జరుగుతోంది. 

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/