గోల్డెన్‌ టెంపుల్‌లో భారీ బందోబస్తు

ఆపరేషన్‌ బ్లూ స్టార్‌కు 35 ఏళ్లు

Golden Temple, Amritsar
Golden Temple, Amritsar

అమృత్‌సర్‌: ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ ఘటనకు 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌ దేవాలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, పారామిలిటరీ బలగాలను పెద్ద ఎత్తున బందోబస్తుగా ఏర్పాటు చేశారు. 1984లో జూన్‌ 1 నుంచి 8 మధ్య ఈ ఆపరేషన్‌ చేపట్టారు. ఆలయంలో దాగి ఉన్న తీవ్రవాదుల ఆటగట్టించడానికి అప్పటి ప్రధాని ఇందికాగాంధీ ఆపరేషన్‌ బ్లూ స్టార్‌కు ఆదేశాలు జారీ చేశారు. తీవ్రవాదుల నాయకుడు జర్నైల్‌ సింగ్‌ బింద్రన్‌వాలా ఈ ఆపరేషన్‌లో హతమయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/