పులిచర్మం, దంతాలు స్వాధీనం

Tiger skin recovery
Tiger skin recovery

గౌహతి : అసోం పోలీసులు వన్యప్రాణి నేరాల నిరోధక సంస్థ అధికారులు, అటవీశాఖ అధికారులతో కలిసి వన్యప్రాణుల వేటగాళ్ల ఆట కట్టించిన ఘటన అసోం రాష్ట్రంలోని థీమాజీ జిల్లా జోనాయ్ ప్రాంతంలో వెలుగుచూసింది. ముగ్గురు వేటగాళ్లు ఓ పులిని వేటాడి చంపి దాని చర్మం, గోళ్లు, ఎముకలను తీసుకువెళుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వేటగాళ్లు అసోం రాష్ట్రంలో వన్యప్రాణులను వేటాడగా పట్టుకున్నామని అసోం పోలీసులు చెప్పారు. ఇక ముందు అసోం అడవుల్లో వన్యప్రాణులను వేటాడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.