ఆయుధాలు తరలిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులు అరెస్టు!

Weapons
Weapons

కథువా: భారత్ లో ఉగ్రదాడులకు పాక్ పన్నిన భారీ కుట్రను భద్రతాబలగాలు భగ్నం చేశాయి. ఉగ్రమూకలకు అందించేందుకు ఓ లారీ నిండా తీసుకెళుతున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటన జమ్మూలోని కథువా జిల్లాలో చోటుచేసుకుంది. పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి ఓ ట్రక్కు కశ్మీర్ కు బయలుదేరింది. అయితే ఈ ట్రక్కులో ఆయుధాలను రహస్యంగా తరలిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఈ ట్రక్కును కథువా జిల్లాలోని లఖన్ పూర్ వద్ద చుట్టుముట్టారు. ఈ సందర్భంగా ట్రక్కును పరిశీలించగా, ఆరు ఏకే47 తుపాకులు, గ్రనేడ్ లాంఛర్లు, పలు ఇతర ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆయుధాలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ ట్రక్కు కశ్మీర్ నంబర్ ప్లేట్ తో ఉందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అసలు ఆయుధాలు దేశంలోకి ఎలా వస్తున్నాయి? అంతర్జాతీయ సరిహద్దు గుండా పాక్ ఉగ్రసంస్థల అధినేతలు భారత్ లోకి ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్నారా? ఖలిస్థాన్ తీవ్రవాదులుపాక్ ఉగ్రవాదులు పరస్పర సహకారంతో ఆయుధాల స్మగ్లింగ్ చేపడుతున్నారా? అనే కోణంలో భారత బలగాలు, పోలీసులు విచారణ జరుపుతున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/