ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

encounter
encounter

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో కాశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. జిల్లాలోని వాచ్చి ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్పీఎఫ్ బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీంతో కాల్పులకు దిగిన ఉగ్రవాదులపై భద్రత బలగాలు ఎదురు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/