మూడు బిజెపి కార్యాలయాలపై దాడి

BJP party
BJP party

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి మూడు బిజెపి పార్టీకి చెందిన కార్యాలయాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కార్యలయాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి జెండాలను చింపేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బెంగాల్‌కు పారా మిలటరీ బలగాలను పంపాలని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్‌వర్గీయ ఎన్నికల కమిషన్‌ను కోరారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు అమర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కైలాష్ విజ్ఞప్తి చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/