ఇవి కూడా ఎన్నికల గుర్తులే

robot, Laptop, cc camera
robot, Laptop, cc camera

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఎన్నికల్లో ప్రచారం ఎంత ముఖ్యమో సరైన గుర్తు అంతే ముఖ్యం. ప్రధాన పార్టీలకు గుర్తుల సమస్య ఉండదు. కానీ కొత్తగా ఏర్పడిన పార్టీలు, లేదా స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తు విషయంలో కాస్త ఇబ్బందే. ఈ గుర్తులను ఎన్నికల సంఘమే కేటాయిస్తుంది. కొన్నింటిని పార్టీలు ప్రతిపాదించినప్పటికీ, మరొకొన్నింటిని ఎన్నికల సంఘమే నిర్దేశిస్తుంది. ఇటీవల జనసేనకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తు, మక్కల్‌ నీది మయ్యుమ్‌కి ఇచ్చిన టార్చ్‌లైట్‌ గుర్తు ఈ కోవలోకి చెందినవే.దేశంలోని కొన్ని కొత్త పార్టీలకు, కొందరు స్వత్రంత్ర అభ్యర్థులకు ఈసీ టెక్నికల్‌ డివైజ్‌లను గుర్తులుగా కేటాయించింది.సీసీటీవీ కెమెరాలు, యూఎస్‌బీ స్టిక్స్‌, సెల్ఫీ స్టిక్స్‌, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ మౌస్‌, మొబైల్‌ ఫోన్లు, పెన్‌డ్రైవ్‌, పవర్‌ బ్యాంక్‌, రోబోలను గుర్తులుగా కేటాయించింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/