రాహుల్‌ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Rahul Gandhi with Robert Vadra
Rahul Gandhi with Robert Vadra

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం చెందిన తర్వాత దానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయన భావ, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్డ్‌ వాద్రా తన అధికార ఫేస్‌బుక్‌ ఖాతాలో రాహుల్‌ను ఉద్దేశిస్తూ లేఖ రాశారు. రాహుల్‌ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, దేశ యువత రాహుల్‌ మార్గదర్శకత్వాన్ని కోరుకుంటుందని రాబర్ట్‌ వాద్రా అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించిన ఆయన.. పదవి కంటే ప్రజాసేవే గొప్పదనే విషయాన్ని రాహుల్ మరోసారి రుజువుచేశారన్నారు. ప్రజలతో మమేకమై సేవ చేసే విషయంలో రాహుల్‌తో కలిసి పనిచేస్తానన్నారు .


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/