వారి ఉదార స్వభావం మరింత స్ఫూర్తి

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

venkaiah naidu
venkaiah naidu

ఢిల్లీ: రాజస్థాన్‌ కు చెందిన రైతు పబురామ్‌మందా, వారి కుటుంబ సభ్యులు జీవిత కాల కష్టపడి సంపాదించుకున్న రూ.50 లక్షలు లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు వినియేగిండం ప్రశంశనీయయని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వారి ఉదార స్వభావానికి ట్విట్టర్‌ వేదికగా అభినందించారు. వ్యవసాయం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికి వారు స్పందించిన తీరు, ప్రాచీన భారత సంప్రదాయమైన ఇతరులతో కలిసి పంచుకోవడం, తోటి వారికి సాయం చేయాలనే దానికి నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనలు సేవ చేయాలనుకునే వారికి మరింత స్పూర్తి నిస్తుందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/