పోలీసుల భధ్రతకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

police
police

లక్నో: కరోనా నివారణ కొరకు దేశంలో లాక్‌డౌన్‌ విధించిన విషయం అందరికి విదితమో, ఈ సందర్బంగా దేశంలోని ప్రజలు ఎవరు లాక్‌డౌన్‌ నియమాలు ఉల్లంఘించి రోడ్ల మీదికి రాకుండా పోలీసులు లాఠీచార్జిలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలలో పోలీసుల భధ్రతకు సంబందించి ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల విధులకు భంగం కలిగిస్తు వారిపై ఎవరైనా దాడులకు పాల్పడితే వారిని ఉపేక్షించకుండా, చట్టపరమైన చర్యలు తసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రత చట్టం కింద కేసులు నమోదు చేయాలని సూచించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/