ఉగ్రవాద మూలాల్ని ఏరి పారేయాలి: అజిత్‌ దోవల్‌

ajit doval
ajit doval

న్యూఢిల్లీ: పొరుగుదేశమైన పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం చేయడమేకాకుండా, వారికి ఆయుధాలు సైతం సమకూర్చడమే ఎజెండాగా తన విధానాన్ని కొనసాగిస్తున్నదని, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అన్నారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ బాహాటంగా అందిస్తున్న అన్ని రకాల సహాయంపై భారత భద్రత సంస్థలు సాక్ష్యాలు సేకరించి వాటిని అంతర్జాతీయంగా బహిర్గతం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఎటిఎస్‌ (యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌), ఎస్టీఎఫ్‌ (స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌)చీఫ్‌లకు సూచించారు. ఢిల్లీలో జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఎ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పాక్‌ పాల్పడుతున్న దుశ్చర్యలకు సంబంధించిన సాక్ష్యాలను సంపాదించి అంతర్జాతీయ మీడియా ముందు బహిర్గతం చేయాలని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎటిఎస్‌, ఎస్టీఎఫ్‌, ఎన్‌ఐఎలు మాత్రమే పాక్‌ ఉగ్ర కార్యకలాపాలపై సాక్ష్యాలను సేకరించగలరన్నారు. మనకు నిజాలు, సాక్ష్యాలు కావాలి. దొరికిన సాక్ష్యాలను నిర్మూలించవద్దు. వాటిని ఉపయోగించుకోవాలి, మీడికు ఇవ్వాలి. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి అని దోవల్‌ స్పష్టం చేశారు. భారత్‌లో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో ఎన్‌ఐఎ కృషిని ప్రశంసించిన ఆయన ఈ సంస్థ మిగతా భద్రతా సంస్థలను మించి ముందుకు వెళుతుందన్నారు.

ఎటిఎస్‌, ఎస్టీఎఫ్‌ సిబ్బంది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి సైనికులాగా మారాలని, ఒక వ్యక్తి సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఎపిఎఫ్‌)లో ఉద్యోగిగా చేరగానే తానొక విచారణాధికారిగా కాకుండా సైనికుడిగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అది ముజాహిదీన్‌, లష్కరే తోయిబా లేదా ఇతర ఏ ఉగ్రవాద సంస్థఅయినా సైనికుడిగా ముందుకు దూసుకుపోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం మనకు కొత్త కాదు. గత 30 యేళ్లుగా ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాద మూలాలను వెతికి పారేయాలి. ఇందులో అసలు ఉగ్రవాదులు ఎవరు? వారు తమకు కావాల్సిన నిధులు, ఆయుధాలు ఎక్కడి నుంచి పొందుతున్నారు? యేయే దేశాలు వారికి మద్దతిసుతఆన్నయి. వంటి విషయాలను వెలికి తీయాలన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలను అంతర్జాతీయకోర్టులముందుకు తీసుకెల్లాల్సిఉందన్నారు. ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కీలక దశ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రీసెర్చ్‌ అండ్‌ అనాలిస్‌ వింగ్‌, ఇంటలిజెన్స్‌ బ్యూరో, జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వాలు తమ వంతు కృషిని చేశాయి. కాని ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో రాష్ట్ర పోలీసులకే ప్రథమ పాత్ర అని దోవల్‌ పేర్కొన్నారు. అంతకుముందు ఎన్‌ఐఎ డైరెక్టర్‌ జనరల్‌యోగేష్‌ చందర్‌ మోడీ సదస్సును ప్రారంభించిన దోవల్‌ బంగ్లాదేశ్‌ ఉగ్రవాద సంస్థ జమాత్‌ ఉల్‌ ముజాహిదీన్‌, భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తోందని చెప్పారు. అక్రమ వలసలు కొనసాగుతున్న తూర్పు సరిహద్దు రాష్ట్రాల్లో దాని ఉనికి వేగంగా విస్తరిస్తోందని దోవల్‌ పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/