తొలి విడత లోక్‌సభ ఎన్నికల్లో వెల్లివిరిసిన చైతన్యం…

Nitin Gadkari
Nitin Gadkari

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు….
శతాధిక వృద్ధులు ఓటు హక్కు వినియోగం…
న్యూఢిల్లీ,: దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్‌ చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.తొలి విడతలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5గం.లకు పోలింగ్‌ ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో 24, తెలంగాణలో 17, ఉత్తరాఖండ్‌లో 5, ఉత్తర ప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 7, బీహార్‌లో 6, అస్సోమ్‌లో 5, ఒడిశాలో 4, జమ్మూకాశ్మీర్‌లో 2, పశ్చిమబెంగాల్‌లో 2, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 2,మేఘాలయలో 2, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌, అండమాన్‌, నికోబార్‌,లక్షద్వీప్‌లలోని ఏకైక లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారు ఉత్సామం చూపారు. శతాధిక వృద్ధులు, పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండకాలం కావడంతో ఉదయమే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు.
దేశవ్యాప్తంగా ఓటేసిన ప్రముఖులు….
దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పలు చోట్ల పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగ్‌పూర్‌లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కుటుంబంతో కలిసి ఓటు వేశారు. నాగ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్జీటతో గెలుస్తామని గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. మజ్లిస్‌ అధినేత, సదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకుఆన్నరు. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రడూన్‌లో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ ఓటు వేశారు. హల్‌ద్వానిలో ఉత్తరాఖండ్‌ మాజీ సిఎం హరీశ్‌ రావత్‌ క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ఓటు వేశారు. ఓటు వేయడం మన బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలని భగవత్‌ ఈసందర్భంగా పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో కేంద్రమంత్రి వికె సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ చింతమడకలో తన భార్య శోభతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మా బాధ్యత అని అన్నారు.
ఓటేసిన శతాధిక వృద్ధులు..
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో శతాధిక వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిక్కిం రాష్ట్రంలోని ఓ 107 ఏళ్ల వృద్ధురాలు సుమిత్రారా§్‌ు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. పాక్‌లాక్‌ కమరాంగ్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూతు వద్దకు వీల్‌ చెయిర్‌లో వచ్చారు సుమిత్ర. అక్కడ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈమేరకు సిక్కిం సమాచార శాఖ సుమిత్రా ఫోటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. సుమిత్రాను ఆదర్శంగా తీసుకున్నారో ఏమే కానీ…నాగాలాండ్‌లో ఓ శతాధిక వృద్ధుడు ఓటేశాడు. మోకోక్‌చుంగ్‌ జిల్లాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇతనే కాక దేశంలో వివిధ ప్రాంతాల్లో సీనియర్‌ సిటిజన్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గయాలో ఓ వృద్ధుడికి సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు సాయం అందజేశారు. నాగ్‌పూర్‌లో కూడా వృద్ధుల ఓట్లు అధికంగా నమోదయ్యాయి. అదేవిధంగా జమ్మూకాశ్మీర్‌లో సత్యదేవి అనే 83ఏళ్ల వృద్ధురాలికి జవాన్లు సాయం అందించారు. చేయిపట్టుకొని పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చారు. గురువారం ఓటేసిన సత్యదేశి మొత్తం 17సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకొని రికార్డు సృష్టించారు.

మరిన్నీ తాజా క్రీడా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/S