దేశ ప్రజలకు ప్రధాని రిపబ్లిక్‌ డే విషెస్‌


The 71st Republic Day Celebrations from Rajpath, New Delhi

న్యూఢిల్లీ: 71వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇండియా గేట్‌ సమీపంలోని జాతీయ యుద్ధవీరుల స్మారకాన్ని సందర్శించి నివాళి అర్పిస్తారు. అనంతరం ప్రధాని, తదితరులు రాజ్‌పథ్‌కు బయలుదేరి వెళ్తారు. రాజ్‌పథ్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకం ఆవిష్కరణ చేస్తారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే పరేడ్‌ తిలకిస్తారు. 71వ రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పాల్గొంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/