శశికళ ఇల్లు కూల్చివేతకు సర్కారు నోటీసులు

V. K. Sasikala
V. K. Sasikala

చెన్నై: తమిళనాడు, తంజావూరులోని కూలిపోయేస్థితికి చేరుకున్న శశికల ఇంటిని కూల్చివేయాలంటూ తంజావురు కార్పొరేషన్‌ అధికారులు నోటిసులు ఇచ్చారు. తమిళనాడు ప్రజలకు చిన్నమ్మ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నాడీఎంకే పార్టీ అధినేత జయలలిత నెచ్చెలిగా, అమ్మ తరువాత చిన్మమ్మే అన్నంతగా పేరుబడిన శశికళ పార్టీలోనూ, పాలనలోనూ చక్రం తిప్పారు. కాగా ప్రస్తుతం శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పేరిట చైన్నె, తంజావురు తదితర ప్రాంతాల్లో సొంత ఇళ్లు ఉన్నాయి. తంజావురులో ఉన్న ఈ ఇల్లు దాదాపు 10,500 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉంది. ఈ ఇంటిలో మనోహర్‌ అనే వ్యక్తి అద్దెకు ఉంటుండగా, గత నెలలో కార్పొరేషన్‌ అధికారులు, దాన్ని పరిశీలించి, నివాసయోగ్యానికి అనువుగా లేదని వెంటనే కూల్చివేయాలని సూచించారు. నోటీసులు జారీ చేసిన తరువాత కూడా ఇంటిని కూల్చపోవడంతో కార్పొరేషన్‌ అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/