గవర్నర్‌ కోటా నుంచి థాకరే ఎన్నిక ..!

ఎమ్మెల్సీ చేయాలని కేబినేట్‌ నిర్ణయం

uddav thackeray
uddav thackeray

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్‌ కోటానుండి ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరే ను ఎమ్మేల్సీగా నామినేట్‌ చేయాలని రాష్ట్ర కేభినేట్‌ రికమెండ్‌ చేసింది. కాగా ఇప్పటి వరకు థాకరే ఉభయసభలలో ఎక్కడా కూడా సభ్యత్వం లేదు. ప్రస్తుతం గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీనితో ఈ రెండు సీట్లలో ఒక సీటునుంచి థాకరేను ఎంపిక చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయించి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యీరీని కోరినట్లు మంత్రి అనిల్‌ పరబ్‌ తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/