ఉగ్రదాడిలో నలుగురికి గాయాలు

terrorist attack
terrorist attack


శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తరువాత ఉద్రిక్తతలు ఉన్నప్పటికి ఉగ్రవాదుల దాడులు కొంత వరకు తగ్గాయి. కాని కొన్ని చోట్ల ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు ఒక ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో చిన్న పాపతో పాటు ఆ కుటుంబంలోని నలుగురు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. సోపోర్‌ దాంగర్‌పోరాలో ఉగ్రవాదులు ఒక బాలికతోపాటు నలుగురిపై కాల్పులు జరిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగానే ఉందని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు కాశ్మీర్‌ పోలీసులు ట్విటర్‌లో పోస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన జమ్మూ, కాశ్మీర్‌ను, లడఖ్‌లను కేంద్ర పాలిత రపాంతాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5 నుండి రాష్ట్రంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. అప్పటి నుండి కొన్ని ప్రాంతాలలో చెదురుమదురు సంఘటనలు తప్ప పెద్ద సంఘటనలు ఏమీ జరగలేదు. సంచారజాతులకు చెందిన వారిలో ఇద్దరు ఉగ్రవాదుల దాడిలో చనిపోవడంతో దక్షిణ కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/