ఢిల్లీలో కలకలం

TENSION
TENSION

ఢిల్లీలో కలకలం

న్యూఢిల్లీ: ఒకే కుటుంబంలో 11మంది కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం సంచలనం సృష్టించింది. ఉత్తర ఢిల్లీ ప్రాంతంలోని బురారిలో ఆదివారం ఉదయం ఒక ఇంటిలో 11శవాలు బయట పడినాయి. కొన్ని మృతదేహాల తల, ముక్కు,నోరు గుడ్డలతో కట్టేసి ఉండగా మరికొన్ని సీలింగ్‌కు వేలాడుతున్నాయి. 75ఏళ్ల వృద్థురాలి శవం నేలన పడుందని పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో హటాత్తుగా అందరూ హతం అవ్వటం చుట్టు పక్కల నివాస ప్రాంతాలలోని ప్రజలు భయందోళనలకు గురి అయ్యారు. ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటన ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఘటనా స్థలాన్ని ఆదివారం సందర్శిం చారు.