మహాత్ముడికి గుడి…టీ, కాఫీలే నైవేద్యం

  • 1948లో నిర్మితమైన గుడి
  • రోజుకు మూడు పర్యాయాలు పూజలు
Temple in Karnataka Mahatma Gandhi
Temple in Karnataka Mahatma Gandhi

మంగళూరు: భారత్ లో ఎక్కడికెళ్లినా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలు దర్శనమిస్తుంటాయి. కూడళ్లు, ముఖ్యమైన ప్రదేశాల్లో గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే, మంగళూరులోని కంకనాడి ప్రాంతంలో మహాత్ముడికి గుడికట్టి పూజిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడి ఆలయంలో మూల విరాట్టు స్థానంలో కూర్చుని ఉన్న స్థితిలో గాంధీ దర్శనమిస్తాడు. నిత్యం ఇక్కడ మూడు పర్యాయాలు పూజాదికాలు నిర్వహిస్తారు. ఇతర ఆలయ సంప్రదాయాలకు భిన్నంగా ఇక్కడ అరటిపండ్లు, టీ, కాఫీలే నైవేద్యాలు. కంకనాడిలో 1948లో గాంధీ ఆలయం నిర్మితమైంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/