బిజెపిలోకి తెలంగాణ టిడిపి – కాంగ్రెస్ నేతలు

bjp
bjp

న్యూఢిల్లీ : తెలంగాణకు చెందిన పలువురు టిడిపి, కాంగ్రెస్ నేతలు ఈరోజు బిజెపిలో చేరారు. తెలంగాణ టిడిపి అగ్రనేత రేవూరి ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపి రవీంద్రనాయక్ లు తమ అనుచరులతో కలిసి బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో వారు బిజెపిలో చేరారు. తెలంగాణలో బిజెపి పటిష్టతకు తమ వంతు కృషి చేస్తామని రేవూరి, రవీంద్రనాయక్ లు వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం ఏ పని అప్పగించినా అంకితభావంతో పని చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, తెలంగాణ బిజెపి చీఫ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/