తేజ్‌బహదూర్‌ నామినేషన్‌ తిరస్కరణ

Tej Bahadur Yadav
Tej Bahadur Yadav

వారణాసి: సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి తేజ్‌ యాదవ్‌(బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాన్‌) వారణాసి లోక్‌సభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఈ సందర్భంగా తేజ్‌బహదూర్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతు నా నామినేషన్‌ను కావాలని తిరస్కరించారు. మంగళవారం సాయంత్రం 6.15 గంటల్లోపు అవసరమైన పత్రాలు సమార్పించాము. అయినకూడా నా నామినేషన్‌ను తిరస్కరించారు. అంతకాక అఫిడవిట్‌లో పొందపర్చిన వివరాలపై తగిన సాక్షాధారాలను తాను మంగళవారం ఉదయం 11 గంటలకు ముందే అందజేయలేదని ఇపుడు అధికారులు చెప్తున్నారని, తాము మాత్రం సాక్ష్యాధారాలు సమర్పించామని తేజ్‌బహదూర్ స్పష్టం చేశారు. నామినేషన్ తిరస్కరణపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని తేజ్‌బహదూర్ యాదవ్ అన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/